Breaking News

గ్రామీణ యవతకు అవకాశాలు

-నాక్ ఏడీ జున్నూరు రాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ యవతకు నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ పరిధిలో, లెవెల్- 5, ప్లంబింగ్ సూపర్వైజర్ కోర్స్ లో, ప్రవేశ అవకాశం కల్పించనున్నట్లు దవళేశ్వరం నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్, అసిస్టెంట్ డైరెక్టర్ జున్నూరు రాజు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
దవళేశ్వరం నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా నేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ పరిధిలో, లెవెల్- 5, ప్లంబింగ్ సూపర్వైజర్ కోర్స్ లో యువతకు అవకాశం కల్పించడం జరగుతుందని, ఇందుకు సంబందించి 21 నుంచి 35 సంవత్సరాల మద్యగల వయస్సు గలవారై ఉండాలన్నారు. విద్యార్హతలకు సంబందించి 10+2, ఐ.టి.ఐ ఆ పైన చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పైన తెలిపిన అన్ని కోర్సుల్లో 3 నెలలు వసతి సౌకర్యం ఇచ్చి నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో తగిన సంఖ్య తో అభ్యర్థులు రాగానే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రముఖ అసెస్మెంట్ ఏజెన్సీ తో అస్సేస్మెంట్ జరుగు తుందని, మెరుగైన అవకాశలు అందుకో గల నైపుణ్యాలు పొందేందుకు ఇది మంచి తరుణ మని అసిస్టెంట్ డైరెక్టర్ జున్నూరు రాజు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కౌన్సిలింగ్ కొరకు మొబైల్ నెంబర్ కు 9493093080, సంప్రదించవచ్చునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *