Breaking News

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీం కోర్టు వారి ఆదేశానుసారం శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మరియు లింగంపేట ప్రాంతంలో “పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం, 2013” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి కె . ప్రత్యూష కుమారి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు – “సమానత్వ హక్కు”, “జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ” గురించి వివరించారు. పని ప్రదేశాలలో స్త్రీల పై జరుగుతున్న వేధింపులు మరియు వారి పట్ల వివక్ష మహిళల హక్కులకు భంగం కలిగించడమే అని తెలియజేశారు. మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించేదుకు “పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టం, 2013” అమలు లోకి వచ్చిందని, ఈ చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు లైంగిక వేధింపులుగా పరిగణించ బడతాయి, అలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్షలు విధించ బడతాయని వివరించారు. మహిళల భద్రత కోసం గౌరవ సుప్రీం కోర్టు వారు “విశాఖ వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం మరియు ఇతరులు” అనే కేసు నందు చారిత్రక తీర్పు ద్వారా చేసిన నిర్దేశాల గురించి తెలిపారు. ప్రతీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థ “అంతర్గత ఫిర్యాదుల కమిటీ” తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో ఛైర్మన్, కనీసం ఇద్దరు సభ్యులు, మహిళల కోసం పని చేస్తున్న ఒక ఎన్జీఓ నుండి సభ్యులు ఉంటారని, సభ్యత్వంలో 50 శాతం తప్పనిసరిగా మహిళలు ఉండాలని అన్నారు. మహిళలకు భద్రత కలిగిన పనిప్రదేశాలు సమకూర్చే బాధ్యత ఆ సంస్థ పైన ఉంటుందని అన్నారు.

అలాగే ప్రతీ జిల్లాలో “స్థానిక ఫిర్యాదుల కమిటీ” ఉంటుందని తెలిపారు, పని చేస్తున్న సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేని పక్షంలో స్థానిక ఫిర్యాదుల కమిటీ నందు ఫిర్యాదు చేయాలని వివరించారు. పని చేసే మహిళలకు పని ప్రదేశాలలో, సహఉద్యోగుల వల్ల లేదా అధికారుల వల్ల వేదింపులు ఎదురైతే ఈ కమిటీలలో ఫిర్యాదులు చేయాలని వివరించారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుందని, మహిళలకు ఉచిత న్యాయ సేవలు మరియు ఉచిత న్యాయ సలహాలు అందిస్తుందని తెలిపారు. వివిధ సంస్థల్లో పని చేస్తున్న మహిళలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *