విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు చూచనలతో గుంటూరు రీజనల్ ల్యాబొరేటరీ సీనియర్ వాటర్ అనలిస్ట్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం నేడు విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ లో నీటి నమూనాలు సేకరించడం జరిగింది. రా వాటర్, క్లారి ఫ్లయ్యర్, ఫిల్టర్ బెడ్స్, క్లియర్ వాటర్ సంపు లలో నీటి నమూనాలు సేకరించడం జరిగింది. సూక్ష్మజీవుల మరియు రసాయనిక పరీక్షల కొరకు నీటి నమూనాలను ప్రాంతీయ ప్రయోగశాల గుంటూరు కు తరలించినట్లు సీనియర్ వాటర్ అనలిస్ట్ వినుకొండ రాజారావు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ప్రయోగశాల శాంపిల్ టేకర్స్ శివకుమార్,సత్యనారాయణ, టెక్నీషియన్ భాస్కరరావు,ఎఇ బసివిరెడ్డి, టెక్నీషియన్ ప్రదీప్, మరియు హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News