Breaking News

అంద‌మైన చేతిరాత‌.. ఉజ్వ‌ల భ‌విత‌కు వెలుగు రేఖ‌

– విద్యార్థులు అంద‌మైన చేతిరాత‌పై దృష్టిసారించాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంద‌మైన చేతిరాత‌.. ఉజ్వ‌ల భ‌విత‌కు వెలుగు రేఖ అని సాంకేతిక విజ్ఞానం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ అందమైన చేతిరాత ద్వారా మేధో వికాసం సాధ్య‌మ‌వుతుంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
జాతీయ చేతిరాత దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ విద్యార్థులు లాజిక‌ల్‌గా గుర్తుంచుకొని.. అంద‌మైన చేతిరాత ద్వారా ప్ర‌జెంట్ చేయ‌డం ద్వారా ప‌రీక్ష‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌తి విద్యార్థీ అంద‌మైన చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల‌ని సూచించారు. లిజ‌నింగ్‌, రీడింగ్‌, స్పీకింగ్‌, రైటింగ్ (ఎల్ఆర్ఎస్ఆర్‌)లో లిజ‌నింగ్‌, రైటింగ్ నైపుణ్యాలు అత్యంత ముఖ్య‌మైన‌వ‌ని.. ఈ నైపుణ్యాలు పెంపొందించుకుంటే మిగిలిన నైపుణ్యాల‌ను తేలిగ్గా స‌ముపార్జించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. విద్యార్థులు చేతిరాత‌ను మెరుగుప‌ర‌చుకుంటూ జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల్లో ప్ర‌తిభ చాటాల‌ని సూచించారు. నిజాయితీ, ఓర్పు, నిబ‌ద్ధ‌త‌, హార్డ్‌వ‌ర్క్‌తో సాధ‌న‌చేస్తే అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌వ‌చ్చ‌ని.. ఇందుకు చంబ‌ల్ ప్రాంతానికి చెందిన మ‌నోజ్ కుమార్ శ‌ర్మ జీవితం ఉదాహ‌ర‌ణ అని వివ‌రించారు. క‌డు పేద‌రిక కుటుంబంలో ఉన్నా అవ‌రోధాల‌ను అధిగ‌మించి.. ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి మ‌నోజ్ కుమార్ శ‌ర్మ ఐపీఎస్ సాధించిన‌ట్లు పేర్కొన్నారు. ఆయ‌న జీవితం ఆధారంగా తీసిన ట్వ‌ల్త్ ఫెయిల్ చిత్రం విశేషాల‌ను క‌లెక్ట‌ర్ డిల్లీరావు విద్యార్థుల‌కు వివ‌రించారు.
అంద‌మైన చేతిరాత ఓ జీవ‌న నైపుణ్యం: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ డా. జి.ల‌క్ష్మీశ
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ అంద‌మైన చేతిరాత అనేది ఓ జీవ‌న నైపుణ్యం (లైఫ్ స్కిల్‌) అని.. త‌మ పిల్ల‌ల‌కు అక్ష‌రాభ్యాసం చేసిన‌ప్ప‌టి నుంచే అంద‌మైన చేతిరాత‌పై త‌ల్లిదండ్రులు దృష్టిసారించాల‌ని సూచించారు. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండ‌టం అనేది చాలా ముఖ్య‌మ‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో రాసే అంద‌మైన చేతిరాత‌.. మేధస్సును సుసంప‌న్నం చేసి వ్య‌క్తిత్వాన్ని కూడా అదే విధంగా విక‌సించేలా చేస్తుంద‌న్నారు. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు గారు మంచి కార్యాచ‌ర‌ణ‌తో విద్యార్థుల్లో అంద‌మైన చేతిరాత నైపుణ్యాల‌ను పెంపొందించేందుకు ప్రోత్సాహం అందిస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.
జాతీయ‌స్థాయి కాలిగ్ర‌ఫీ ప్ర‌త్యేక చేతిరాత నిపుణులు పి.భువ‌న‌చంద్ర మాట్లాడుతూ చ‌ద‌వ‌డం ఎంత ముఖ్య‌మో అందంగా రాయ‌డం అంతే ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జిల్లాలో 2023-24లో 6,500 మంది విద్యార్థుల‌కు చేతిరాత‌లో శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని.. వీరిలో 100 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో, 16 మంది జూనియ‌ర్ కేట‌గిరీ అంత‌ర్జాతీయ స్థాయి పోటీల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు కుమారుడు ఎస్‌.జివితేష్ ఆగ‌స్టులో జ‌రిగే అంత‌ర్జాతీయ ఎన్నారై కాలిగ్ర‌ఫీ లైవ్ కాంపిటేష‌న్‌కు ఎంపికైన‌ట్లు తెలిపారు.
కార్య‌క్ర‌మంలో అమ్మ ఒడి చేతిరాత శిక్ష‌ణ కేంద్రం ఛైర్మ‌న్ ఎల్‌.శేఖ‌ర్‌, ఉషోద‌య ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రిన్సిప‌ల్ మ‌హ్మ‌ద్ ర‌ఫీ, రావూస్ ఇంగ్లిష్ మీడియం ప్రిన్సిప‌ల్ కాలేషా, లిటిల్ ఏంజెల్స్ ప్రిన్సిప‌ల్ ఎన్ఎస్ఎస్ శ్రీనివాస్‌, నాగార్జున స్కూల్ ప్రిన్సిప‌ల్ రామ్మోహ‌న్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ‌స్థాయి చేతిరాత పోటీల‌కు ఎంపికైన విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ డిల్లీరావు, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డా. జి.ల‌క్ష్మీశా త‌దిత‌రులు స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేశారు. చేతిరాత‌ను అందంగా మార్చుకున్న ఉపాధ్యాయుల‌కు, శ్రీరామ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయుల‌కు కూడా స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *