Breaking News

ఎల‌క్ష‌న్ సీజ‌ర్ నిర్వ‌హ‌ణ‌కు ప్రత్యేక యాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లను స్వేచ్ఛాయుతంగా, నిష్ప‌క్ష‌పాతంగా నిర్వ‌హించే క్ర‌మంలో ఈసీఐ వివిధ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వేదిక‌ల‌ను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగానే ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ (ఈఎస్ఎంఎస్‌) మొబైల్ యాప్‌ను రూపొందించిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఈ యాప్ వినియోగంపై వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌ని సూచించారు.
మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క సీఈవో కార్యాల‌యం నుంచి ఈసీఐ అధికారుల బృందం.. ఈఎస్ఎంఎస్ యాప్‌పై క‌ర్ణాట‌క అధికారుల‌కు ఫిజిక‌ల్‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల‌కు చెందిన సీఈవోలు, డీఈవోలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థ నోడ‌ల్ అధికారులు త‌దిత‌రుల‌కు వ‌ర్చువ‌ల్‌గా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరం నుంచి క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. డీసీపీ వి.అజిత‌, వివిధ శాఖ‌ల అధికారులతో క‌లిసి హాజ‌ర‌య్యారు. న‌గ‌దు, లిక్క‌ర్‌, డ్ర‌గ్స్‌, విలువైన వ‌స్తువులు, ఉచితాలు, ఇత‌ర వ‌స్తువుల సీజ‌ర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన యాప్ వినియోగంపై ఈసీఐ అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇటీవల తెలంగాణ‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యాప్‌ను విజ‌య‌వంతంగా వినియోగించ‌డం జ‌రిగింద‌ని ఈసీఐ అధికారులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో వాణిజ్య ప‌న్నుల శాఖ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్‌, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *