Breaking News

ఈ నెల 24న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్వ్యూలు

– జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత అధికారిణి జి.ఉమాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌లో జిల్లా కోఆర్డినేట‌ర్‌, ప్రాజెక్టు అసిస్టెంట్‌, బ్లాక్ కోఆర్డినేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఈ నెల 24వ తేదీన ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా స్త్రీ, శిశుసంక్షేమం, సాధికారత అధికారిణి జి.ఉమాదేవి మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లా కోఆర్డినేట‌ర్‌, ప్రాజెక్టు అసిస్టెంట్‌, బ్లాక్ కోఆర్డినేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి గ‌తేడాది అక్టోబ‌ర్ 24న ద‌ర‌ఖాస్తులు కోరుతూ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం జ‌రిగింద‌ని.. అర్హులైన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ లేఖ‌లు పంపిన‌ట్లు తెలిపారు. ఇంట‌ర్వ్యూ లేఖ‌లు అందుకున్న అభ్య‌ర్థులు ఈ నెల 24వ తేదీ బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు డీఆర్‌వో కార్యాల‌యం, కలెక్టరేట్‌, ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ నందు ఒరిజినల్ సర్టిఫికెట్ల‌తో హాజ‌రుకావాల‌ని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *