-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు త్రాగునీటిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, నీటిని శుద్ధి చేసే ఫిల్ట్రేషన్ బెడ్స్ ను తరచుగా శుభ్రపరచి, శుద్ధమైన నీటిని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 38 వ డివిజన్ లోని కె. ఎల్.రావు హెడ్ వాటర్ వర్క్స్ లో జరుగుతున్న నీటి శుద్ధతను పరిశీలించారు. కృష్ణా నది నుండి వచ్చే నీళ్లలో ఆల్గే్ ఎక్కువగా ఉండటం వలన, నీటిని శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్స్ ని తరచుగా శుభ్రపరచి మరింత శుద్ధి చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫిల్టరేషన్ బెడ్స్ ను శుభ్రపరిచే క్రమంలో అవసరమైతే లేబర్ని పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. నగర పౌరులకు త్రాగునీరు అందించే క్రమం లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, ఎస్ ఇ (ప్రాజెక్ట్స్) రామ్మోహన రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News