Breaking News

ఎంఎస్ బేగ్ సారథ్యంలో నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ టీం టీడీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేశ్ జన్మదిన వేడుకలు జరిగాయి. మంగళ వారం పాతబస్తీ పంజా సెంటర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో టీడీపీ  నాయకుడు ఎంఎస్ బేగ్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు నారా లోకేశ్, యువగళంతో శ్రేణుల్లో జోష్ నింపారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం చాలా సమస్యలను ఎదుర్కొంటుంది, ఇంకో మూడు నెలలలో ప్రజా ప్రభుత్వం రాబోతుంది. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల చెంతకు లోకేష్ వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు. టీడీపీ  నాయకుడు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారధి నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడన్నారు. నారా లోకేష్ నాయకత్వ ప్రతిమ జనాల్లో బాగా నాటుకు పోయిందన్నారు. కేశినేని చిన్ని అడుగుజాడలలోనే తామంతా పనిచేస్తామని తెలిపారు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగ రాస్తామని అని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అనేక అక్రమ కేసులు బనాయించినా, వేధింపులకు గురిచేసినా వారు అధైర్యపడకుండా టీడీపీ కుటుంబానికి నారా లోకేశ్ అండగా ఉంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ కమిటీ ప్రతినిధులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *