Breaking News

ప్రజా సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,శిఖామణి సెంటర్,ఉడుముల రామారావు స్ట్రీట్,వుడ్ పేట ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.

గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు వై. సిద్దార్డ్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్,రెహామ్త్ నగర్,ఆర్&బి కోర్టర్స్,జార్జిపేట,గాంధీ కాలనీ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.

ఈ మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మన ప్రభుత్వం వచ్చాక కలిగే మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి వారిని అడగగా తమకు జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చాలా మేలు జరుగుతుంది అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల తలుపు తట్టి మరీ వారినీ ఆప్యాయంగా పలకరించి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి,వారు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఇంట్లో అందరి మనిషి గా అందరినీ సాకుతున్నారని, మీకు అండగా నిలుస్తున్నారు అని తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదాలు మన సీఎం జగన్ గారిపై మన వైసీపీ ప్రభుత్వం పై ఎల్లవేళలా ఉండాలని, మంచి మనసుతో దీవించాలి అని అవినాష్ అభ్యర్థించారు.ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గడిచిన నాల్గు ఏళ్ళ కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ కి కే దక్కిందన్నారు.గత ప్రభుత్వం లో గద్దె దత్తత తీసుకున్న అని ప్రకటన తప్ప అభివృద్ధి కి తీసుకొన్న చర్యలు ఏంటని ప్రశ్నించారు.ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు మేరకనపల్లి మాధురి,రహేన నాహీద్,కో అప్షన్ సభ్యలు సయ్యద్ అలీమ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *