విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వల్లభనేని శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు నూతన డీఆర్వోకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ట్రాన్స్కో, అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాసరావు బదిలీపై వచ్చారు. డీఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్ డిల్లీరావు గారి నేతృత్వంలో అన్ని విధాలా ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేయనున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News