చంద్రగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు అందరికీ సొంత ఇళ్ళు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ఎం. కొత్తపల్లి లేఅవుట్ నందు జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తనిఖీ చేసి రోజువారీగా సమీక్షతో ప్రణాళికా బద్ధంగా స్టేజి వారీగా ఇళ్ళ నిర్మాణంలో పురోగతి ఉండాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎం. కొత్తప్లలి లేఅవుట్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్ లో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పేదలకు మంజూరు అయిన 5924 ఇళ్లలో ఆప్షన్ 3 కింద చేపట్టిన 4786 గృహాల్లో పురోగతిలో ఉన్న మిద్దె స్థాయి, పైకప్పు స్థాయి లో ఉన్న 1036 గృహాలను త్వరిత గతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొళాయి ఏర్పాటు పెండింగ్ వాటిని పూర్తి చేసేలా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన లబ్ధిదారులకు పొదుపు సంఘాల నుండి రుణాలు అందేలా సమన్వయం చేయాలని సూచించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వారి ఇంటి వద్ద జియో ట్యాగింగ్ ఫోటో దిగి యాప్ తో అనుసంధానం అయ్యేలా సంబంధిత పంచాయతీ అధికారులు వాలంటీర్ల ద్వారా మోబిలైజ్ చేయాలని, ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తయ్యలా చూడాలని ఆదేశించారు. లేఅవుట్ లోని సిమెంట్ ఇటుకల యూనిట్, కంకర యూనిట్ లను పరిశీలించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు, సంబంధిత సచివాలయం సిబ్బంది పూర్తి స్థాయిలో బాధ్యతగా ఈ కార్యక్రమ పురోగతిలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, తిరుపతి నగర పాలక సంస్థ ఉప కమీషనర్ అమరయ్య, హౌసింగ్ డి ఈ లు మోహన్, శ్రీనివాస్, ఆర్ డబ్ల్యు ఎస్, ఎలక్ట్రిసిటీ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News