Breaking News

దుర్గసముద్రం సచివాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ

-నవరత్నాలు .. పేదలందరికీ ఇళ్ళు కింద మంజూరు చేసిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ మిషన్ మోడ్ లో జరగాలి: కలెక్టర్ లక్ష్మీ శ

తిరుపతి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు అందరికీ సొంత ఇళ్ళు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను దుర్గసముద్రం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తనిఖీ చేసి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శనివారం ఉదయం తిరుపతి రూరల్ పరిధిలోని దుర్గసముద్రం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలపై సర్వ హక్కులు కల్పించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలనే సత్సంకల్పంతో ఇచ్చిన ఇంటి పట్టాను లబ్దిదారుల పేరు మీద రిజిష్టర్ చేయించి వారికి సర్వ హక్కులు కల్పిస్తోందని, పది సంవత్సరాల తర్వాత సదరు పట్టాను క్రయ విక్రయం చేసుకునే హక్కు లబ్ధిదారులకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం మిషన్ మోడ్ లో జరగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, హౌసింగ్ డిఈ లు మోహన్, శ్రీరామ్ రెడ్డి, ఎంపిడిఓ చంద్రగిరి రమేష్, ఆర్ఐ శివ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *