-నూతనంగా నిర్మించిన సచివాలయ, RBK భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాని….
-210కోట్ల వాటర్ స్కీమ్ ప్రాజెక్ట్ తో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
-చేసిన మంచిని చెప్తున్న జగన్ మాదిరి….. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ 40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అనగలడా
-ఐదేళ్లలో సీఎం జగన్ పేద ప్రజలకు అందించిన ఒక్క పథకానైన….14ఏళ్ల చంద్రబాబు పాలనలో అమలు చేశారా
నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే కొడాలి నాని, మహిళ ప్రజా ప్రతినిధుల చేత ప్రారంభోత్సవం చేయించారు.తొలుత గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజానీకం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని, పార్టీ నేతలతో కలిసి వైసిపి జెండాను ఎగురవేసి ర్యాలీగా గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్యే నానికు వీధి వీధినా పూల వర్షం కురిపిస్తూ, మంగళ హారతులతో మహిళలు,గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చర్చి వద్ద ఏసుక్రీస్తు ప్రతిమకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన, ఎమ్మెల్యే నాని భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, తీన్మార్ డప్పుల మధ్య యువత కేరింతలు కొడుతుండగా పర్యటనను కొనసాగించారు. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో ఫోటోలు దిగేందుకు చిన్నారులు, యువత ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. నందివాడ మండలంలో దశాబ్దాల త్రాగునీటి సమస్యకు సీఎం జగన్ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.110 ఎకరాల త్రాగునీటి చెరువు, రెండు మండలాల్లో మూడు, మూడు చొప్పున ఆరు హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి సీఎం జగన్ 210 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేశారని ఎమ్మెల్యే నాని తెలియజేశారు. నిర్ణీత సమయమైన 18 నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేసి మారుమూల గ్రామానికి సైతం నిర్విరామంగా సురక్షిత త్రాగునీరు అందిస్తామన్నారు. మోసాలతో నిండిన చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మితే మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆర్థిక ప్రగతి సర్వనాశనం అవుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం పరితపించే జగన్ కు మద్దతుగా రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయ్యాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలాన్ని అందించిన దేవంబొట్ల వెంకట బ్రహ్మాజీని ఎమ్మెల్యే నాని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, ఎంపీపీ పేయ్యల ఆదాం, జడ్పిటిసి కందుల దుర్గా కుమారి, వైస్ ఎంపీపీ పూడి సుధాకర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, సర్పంచ్ కలపాల సుధారాణి, ఎంపీటీసీ గోవాడ నిర్మల కుమారి, వైసిపి యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం, పార్టీ నాయకులు తోట నాగరాజు, ఆర్కె, కలపాల నాగేశ్వరరావు ( నాగులు ), తుమ్మలపల్లి సతీష్,గండికోటి స్వామి,కర్రే వెంకటేశ్వరరావు,పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News