-రైతులకు వ్యవసాయ రుణాలను గురించి అవగాహన కల్పించేలా మండలాల వారిగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి
-వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి : జిల్లా కలెక్టర్ డా.జి . లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరులో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా.జి .లక్ష్మీ శ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో ఎల్డీఎం సుభాష్ ఆర్బిఐ ఎల్డిఓ పూర్ణిమ, వివిధ బ్యాంకు అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో పాటు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు బ్యాంకర్లందరూ సహకరించి సమిష్టిగా రుణాలను మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్దికి కృషి చేయాలన్నారు. పి.ఎం.ఈ.జి.పి రుణాలు అందజేయడంలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉన్నామని అభినందిస్తూ కొంతమంది బ్యాంకర్లు బాగా రుణాలు అందజేస్తూ లక్ష్యానికి మించి మంచి పనితీరు చూపిస్తున్నారని, కొంతమంది బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారని వారు కూడా వారికి నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకొని గ్రౌండింగ్ చేయాలని సూచించారు. ఏపీ టిడ్కో పట్టణంలోని పేదలకు గృహాలు అందించే బృహత్తర కార్యక్రమానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని, బ్యాంక్ లింకేజ్, జగనన్న తోడు, పీఎంఈజీపి రుణాలు, తదితర ప్రాధాన్యత పథకాలకు సకాలంలో రుణాలు అందజేసి గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, సంబంధిత అధికారులు డిఆర్డిఏ, మెప్మా, పరిశ్రమల శాఖ వారు బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని లక్ష్యాలు సాధించేలా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి వారి అభివృద్ధి కోసం సకాలంలో రుణాలు మంజూరు చేసేలా ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి మండలంలో రైతులకు వ్యవసాయ రుణాలను గురించి అవగాహన కల్పించేలా క్యాంపులు నిర్వహించి వచ్చిన దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించి అర్హులైన వారికి రుణాలను మంజూరు చేయించాలని ఆదేశించారు. అనంతరం potential linked credit plan 2024-25 బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేష గిరి రావు, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ దా. శ్రీనివాసులు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జయకుమార్, నాబార్డ్ డి.డి.ఎం సునీల్, పథక సంచాలకులు డిఆర్డిఏ జ్యోతి మెప్మా రాధమ్మ, జిల్లా సూక్ష్మ సేద్య అధికారి సతీష్, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి గీతా రాణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News