Breaking News

నేషనల్ హైవే కి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారుల కి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా, రహదారులు & భవనాలు సెక్రటరీ ప్రద్యుమ్న అమరావతి నుండి నేటి గురువారం వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న జాతీయ రహదారులకోసం అవసరమయ్యే ప్రభుత్వ భూములు, డికేటి భూములు, పట్టా భూములు అవసరం మేరకు విస్తీర్ణాన్ని సేకరించాలని సూచించారు. కలెక్టర్ లు వారి జిల్లాలలో ఎన్ని NHAI ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నవి అనే అంశంపై దృష్టి పెట్టి భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం మొదలుకొని, అవార్డ్స్ పాస్ చేయడం, కంపెన్సేషన్ అందివ్వడం, భూమిని పొసెషన్ వరకు అన్ని స్థాయిలలో క్యాపిటల్ 3A, 3D, 3G మరియు చివరి స్టేజి వరకు త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు NHAI ప్రాజెక్టులకు భూసేకరణ వివిధ స్టేజిలో ఉన్నదని, అవార్డ్ పాస్ చేయడం, కాంపెన్సేషన్ అందజేయడం తదితర అంశాలు వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ వర్చువల్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి కే శుభం బన్సల్, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *