Breaking News

చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం

ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *