-స్పందన కార్యక్రమంలో వచ్చిన 19 ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా, వాళ్ల సమస్యను నేరుగా అధికారులకు చెప్పేందుకే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ 19 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నిరభ్యంతరంగా ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కానీ సచివాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమంలో తెలుపవచ్చని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ల సమస్యని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కార్పొరేషన్ లో జరిగిన స్పందన కార్యక్రమానికి 19 ఫిర్యాదులు వచ్చాయని అందులో ముఖ్యంగా ఎక్కువ శాతం పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించినవిగా అనధికార ఆక్రమణలకు వచ్చిన ఫిర్యాదులుగా తెలిపారు.
సోమవారం కార్పొరేషన్ లో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చిన 19 ఫిర్యాదులో 6 ఇంజినీరింగ్ శాఖకు సంబంధించినదిగా, పట్టణ ప్రణాళిక కు సంబంధించినవి ఏడు ఉండగా, రెవెన్యూ శాఖకు సంబంధించినవి నాలుగు ఫిర్యాదులు మరియు యుసిడి విభాగానికి రెండు ఫిర్యాదులు వచ్చాయి.
స్పందన కార్యక్రమంలో కమిషనర్ గారితో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, ఆఫీసర్ నరసింహమూర్తి, ఆర్ఎఫ్ఓ వెంకటేశ్వరరావు, పి ఓ యు సి డి రోహిణి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News