Breaking News

అంబేద్కర్ స్మృతి వనం పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంబేద్కర్ స్మృతి వనాన్ని సోమవారం ఉదయం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న అంబేద్కర్ స్మృతి వనం నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాటు చేయుటకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో అత్యంత ఆకర్షణీయమైన స్వరాజ్ మైదానంలో ఉన్న అంబేద్కర్ స్మృతి వనం, ఇప్పటికే ఎంతోమంది విహారులను ఆకట్టుకుంటుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అవసరమైన సదుపాయాల గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మిగిలి ఉన్న నిర్మాణం పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేసి అవి కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రిటైనింగ్ వాల్ పరిశీలన
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణానది ఫేస్- 2, రిటైనింగ్ వాల్ వెంబడి సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటుకు కనకదుర్గ వారధి నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.2 కి.మీ పొడవున సుమారు రూ.7.8 కోట్ల నగరపాలక సంస్థ ద్వార రూ.4.5 కోట్ల అర్బన్ గ్రీనరీ ద్వార నిర్మాణం జరుగుతున్న రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ పార్కును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకు రావాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రీ కెనాఫి పెయింటింగ్ త్వరగా పూర్తి చెయ్యమని, ప్రజలను మరింత ఆకర్షించే నిర్మాణం దశలో ఉన్న పాత్ వే, లైటింగ్ ను పరిశీలించారు.అంత్యంత సుందరంగా కనువిందు చేసే గ్రీనేరి ఏర్పాటు చెయ్యమని ఎడిహెచ్ రామ్ మోహన్ కి ఆదేశాలు ఇచ్చారు. పార్క్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు ఇచ్చారు.

ఈ పర్యటన లో కమీషనర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (పార్క్స్) ఎయస్ యన్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్ ఈ రామ్మోహన, డిప్యూటీ ఇంజినీర్ (పార్క్స్) పురుషోత్తం, ఎడిహెచ్ రామ్ మోహన్, తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *