Breaking News

పశ్చిమ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

-పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస రావు, నగర మేయర్ రాయన రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస రావు, నగర మేయర్ రాయన రాయన భాగ్యలక్ష్మి సోమవారం ఉదయం 46వ డివిజన్ లో కమ్యూనిటీ హాల్ కొబ్బరికాయ కొట్టి బంజారా కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్లో గుడి మరియు కళ్యాణ మండపం ఉందని అది బంజారాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, లంబడి అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ అవసరం అని తెలుసుకున్న వెంటనే అత్యంత సుందరంగా కమ్యూనిటీ హాల్ నిర్మించారని. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు డెవలప్మెంట్ కొరకు ఎంతగానో తోడ్పడ్డారని, అభివృద్ధి కేవలం మాటలు మాత్రమే కాదు చేతలు కూడా అని, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని నిత్యం ప్రజలతో ఉంటూ వాళ్లకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, కొండ ప్రాంతం అభివృద్ధి, నిత్యం నీటి సరఫరా కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు విజయవాడ అభివృద్ధి చెందుతుందంటే అది కేవలం జగనన్న పాలనని, జగనన్న పాలనలో ఉన్న నాయకుల వల్లే అభివృద్ధి చెందుతుందని, సంక్షేమం అభివృద్ధి రెండూ, రెండు కళ్ళగా భావించే జగనన్న ప్రభుత్వం నిత్యం ప్రజలతో తోడు ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారితో పాటు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ ఆసిఫ్ తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *