-రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వమే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 42 వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు తిరపతి సురేష్ అనూష మరియు డివిజన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో భవానిపురం పాత పోలీస్ స్టేషన్ ట్రయాంగిల్ పార్క్ 400&350 అడుగుల ప్లాట్స్ లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజున ఫ్యాన్ రెక్కలు విరగొట్టి చెత్తబుట్టలో వెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని వైసిపి పార్టీ నాయకులు అంతా పెద్ద ఎత్తున బయటకి వస్తున్నారని ఫ్యాన్ కి ఓల్టేజి తక్కువ అయిపోయింది అని ఆ పార్టీ నాయకులే చెప్తువున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు మేము ప్రజలతో సింక్ అయ్యి వున్నాము పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో కనెక్ట్ అయి వున్నారు ఈ సారి పవన్ కళ్యాణ్ అని చంద్ర బాబు నాయుడు ని గెలిపించడానికి పూర్తి గా కనెక్ట్ అయి సింక్ అయ్యి ఉన్నారని ఆ మాటనీ చెప్పడానికి జగన్ మోహన్ రెడ్డి నాలుక కాస్త మడత పడింది రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒడిపోతుంది జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ లేక బెంగుళూర్ వెళ్ళిపోవడానికి సిద్దంగా వుండాలని, కేశినేని నాని ఏమి మాట్లాడినా సరే ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారు అని పార్టీ నాయకులే పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు కనీసం ఆయన వెంట ఇద్దరు,ముగ్గురు నాయకులు కూడా నడవని పరిస్థితి ఆయన కూడా తెలుగు దేశం పార్టీ కాళీ అవుతుంది అని మాట్లాడడం హాస్యాస్పదం గా వుందని, మేయర్ స్థానం కోసం కూడా ఆయన జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడుకున్నారు అని ఆయన కుమార్తె కి మేయర్ పదవి ఇప్పించడానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు అని భాగ్య లక్ష్మి ని మార్చే స్తారు అని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుందని, బుద్ధ వెంకన్న చంద్ర బాబు నాయుడు మీద వారి యొక్క ప్రేమను చాటారు అని వారు కూడా చివరిలో చంద్ర బాబు నాయుడు ఏమి చెప్తే అదే నాకు సిరోదార్యం ఆయన నాకు భగవంతుడు లాంటి వారని చెప్పారని, ఇంటింటికి రాబోయే జనసేన టీడీపి కార్యక్రమం ప్రజల వద్ద నుంచి మంచి స్పందన వస్తోంది ఈ సారీ జనసేన టిడిపికి ప్రజలు పట్టం కడతామని ఈ పాలన భరించలేకపోతున్నామని పన్నులు విపరీతంగా పెంచేశారని కరెంట్ చార్జీలు నిత్యాసం ధరలు విపరీతంగా పెంచేసారని పథకాల కోసం సచివాలయాలు దగ్గరికి వెళ్తుంటే వాలంటీర్లు మమ్మల్ని తిప్పుతున్నారు తప్ప పథకాలు ఇవ్వడం లేదని ఇది పెద్ద మోసమని చెప్తున్నారు అని అంతేకాకుండా సెంట్ భూమి పథకం పెద్ద మోసం అనే ప్రజలందరూ కూడా చెప్తున్నారని అన్నారు
తిరుపతి అనూష మాట్లాడుతూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గనుక వస్తే మన ఆస్తుల పేపర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుని వాటిని తాకట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుందని ఎద్దెవా చేశారు… వైసీపీ వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MD ఆయాజ్, దాసి రామ్మోహన్, MDఫయాజ్, SK అల్లా బక్షు, నజీర్,ఆదిత్య రెడ్డి, పసుపులేటి నాగకృష్ణ, మహేశ్వరి, రెడ్డిపల్లి శ్యామ్, శివాజీ ముదిరాజ్, కరిముల్లా, రహిమాన్,కానాల వినోద్ కుమార్, వెంకట్రావు, దాసరి మూర్తి రాజు,తులసి మురళి, తంగా రవి మరియు జనసేన పార్టీ నాయకులు బొమ్ము రాంబాబు, కూరాకుల సురేష్, జెల్లీ రమేష్, శనివారపు శివ, పైలా పవన్, బొట్ట సాయి, సుకాశి భాను ప్రకాష్,పులి చేరి రమేష్, సోమి గోవింద్, తోత్తడి భారత్ బంది చోడే శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News