-స్పందన గ్రీవెన్స్ దివ్యాంగ అర్జీదారునికి రెండు గంటల్లోపు ట్రై సైకిల్ అందచేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
-18 సం. నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: డా.జి. లక్ష్మీ శ
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతతో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని 18 సం. నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి అని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ పేర్కొన్నారు.
సోమవారం ఉదయం గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో డివిజన్ స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి అక్కడే ఆన్లైన్లో నమోదు చేయించి పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసారు. వీరితో పాటుగా ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్ అర్జీదారుల నుండి వినతులు తీసుకున్నారు.
గూడూరు పట్టణానికి చెందిన మద్దిలి మస్తానయ్య పోలియో బాధితులు ట్రై సైకిల్ లేదని, అంత్యోదయ కార్డు కొరకు విన్నవించగా రెండు గంటలలో సదరు విభిన్న ప్రతిభావంతునికి ట్రై సైకిల్ అందచేసి కలెక్టర్ గారు తమకు పేదల పట్ల, అర్జీదారుల సమస్యల పరిష్కారానికి గల అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. అంత్యోదయ కార్డు తాసిల్దారుకు సూచించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అందరూ బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల దృక్పథంతో పని చేయాలనీ అన్నారు. నిర్ణీత కాల వ్యవధి లోపు ప్రజల అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన అర్జీలను త్వరిత గతిన పరిష్కరించాలని నిబంధనల పరిధిలో లేని పరిష్కరించలేని వాటిని అర్జీదారులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబందించిన గ్రీవెన్స్ లు చాలా తక్కువ ఉన్నాయని,
ఎక్కువగా రెవెన్యూ అంశాలపై అర్జీలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ రికార్డులలో సంబంధిత హక్కు దారుని పేరు కాకుండా వేరే వ్యక్తుల పేర్లు ఎక్కించడం వంటి తప్పిదాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీ సర్వే ద్వారా రైతులకు వారి భూ హద్దులు పక్కాగా ఉండేలా వివాద రహిత యాజమాన్య భూ హక్కు పత్రాలు అందించడం జరుగుతోందనీ తెలిపారు.
అలాగే 18 సం. నిండిన ప్రతి ఒక్క యువత ఓటరుగా నమోదు చేసుకొని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ వాణి, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, ఎంపిడిఓ, తహశీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News