విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఇప్పటికే రిజిస్ట్రేషన్ కలిగియుండి నవీకరణ గడువు మించినట్లైతే మార్చి 2024లోపు రెన్యూవల్ చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి పి. మహేశ్వర రెడ్డి తెలిపారు.
గురువారం నగరంలోని సూర్యారావు పేట సహాయ కార్మిక అధికారి వారి కార్యాలయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలకు చెందిన వర్తక యాజమాన్య సంఘాలతో లైసెన్స్ విధి విధానాలపై సహాయ కార్మిక అధికారి పి. మహేశ్వర రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద వ్యాపార సంస్థలు, దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వ్యాపార సంస్థలు, దుకాణములకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగియుండి నవీకరణ గడువు మించినట్లైతే మార్చి 2024లోపు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. ఎవరైనా లైసెన్స్/ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారాలు చేస్తే వారిపై కార్మిక చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు వ్యాపార సంస్థలు దుకాణములలో బాల కార్మికులను పనిలో నియమించినట్లైతే బాల కార్మిక, కౌమార(నిషేద, నియంత్రణ చట్టం`2016 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార సంస్థలు, దుకాణములలో పనిచేస్తున్న కార్మికులందరు ఈ శ్రమ రిజిస్ట్రేషన్ పొంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత పొందాలని సహాయ కార్మిక అధికారి పి. మహేశ్వర రెడ్డి కోరారు.
సమావేశంలో కృష్ణ డిస్టిక్ట్ హౌల్ సెల్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సి.సి.కేశవరావు, సెక్రటరీ కొండపల్లి మురళి, ట్రెజరర్ జి. సురేష్, విజయవాడ ఎలెక్ట్రిల్ డిలర్స్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News