Breaking News

ఉచిత నిర్భంద విద్య కోసం ప్రైవేటు పాఠశాలలు రిజిస్ట్రేషన్ కోసం గడువు పెంపు

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాహక్కు చట్టం- 2009, సెక్షన్ 12 (1)C ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరానికి గాను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న పిల్లలు (అనాథలు, హెచ్ఐవి బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ) బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% కోటా క్రింద ప్రవేశం పొందడానికి పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గురువారం (22వ తేదీ) తో ముగియనుండగా మార్చి ఒకటో తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *