Breaking News

ఇంటర్మీడియేట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్స్ ఫిబ్రవరి 23 నుంచి ఆయా కాలేజీల ద్వారా పొందవచ్చు

-విద్యార్థులకి ర్యాండమ్ విధానం లో పరీక్షా కేంద్రాల కేటాయింపు
-ఇంటర్మీడియట్ పరిక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియేట్ పరిక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్ లో పంపడం జరిగిందని , రేపటి నుంచి హాల్ టికెట్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, ఇంటర్మీడియేట్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 52 పరీక్షా కేంద్రాల లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొత్తం 41,304 మంది హజరు కానుండగా వారిలో మొదటి ఏడాది 21,288 మంది, 2 వ ఏడాది 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇంటర్మీడియేట్ కి 37,502 మంది, వొకేషనల్ కోర్సు 3,802 మంది విద్యార్ధులు ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి కలెక్టర్ మాధవీలత ఇంటర్మీడియేట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకి హాజరయ్యే అభ్యర్థులకు హాల్ టికెట్స్ జారీ విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ ప్రభుత్వము జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్ కి పంపడం జరిగిందన్నారు. విద్యార్దులు సంబందించిన కాలేజి యాజమాన్యాలను సంప్రదించి హాల్ టికెట్స్ పొందాలని కలెక్టర్ సూచించారు. రాబోయే రెండు రోజుల్లో పబ్లిక్ డొమైన్ లో హల్ టికెట్స్ అందుబాటు లో ఉంచడం జరుగుతుందనీ అన్నారు.
మార్చి ఒకటవ తేదీన మొదటి ఏడాది ఇంటర్, వొకేషనల్ కోర్స్, మార్చి రెండవ తేదీ నుంచి రెండవ ఏడాది ఇంటర్, వొకేషనల్ కోర్స్ లకి పరీక్షలు ప్రారంభం అవుతాయని, మార్చి 20 వ తేదీ తో పరీక్షలు పూర్తి అవుతాయని తెలియ చేశారు. ఇంటర్ విద్యార్థులకి ర్యాండమ్ విధానం లో  పరీక్షా కేంద్రాల కేటాయింపు జరుగుతోందనీ తెలియ చేశారు.

ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ తదితర అంశాలకు చెందిన ఏదైనా సందేహాలు, ఇబ్బందులు ఉంటే ఈ దిగువ పేర్కొన్న ప్రాంతీయ ఇంటర్మీడియేట్ కార్యలయం, రాజమహేంద్రవరం లోని కంట్రోల్ రూం ద్వారా సమాచారం అందించనున్నట్లు ప్రాంతీయ ఇంటర్మీడియేట్ అధికారిణి ఐ. శారద తెలియ చేశారు. కంట్రోల్ రూం నంబర్ లు 94922 26232 లేదా ల్యాండ్ నంబర్ 0883 – 2473430 లను పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియ చేశారు.

ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు ప్రాంతీయ ఇంటర్మీడియేట్ అధికారిణి ఐ. శారద , జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి జే వి ఏల్ సుబ్రహ్మణ్యం , జిల్లా వొకేషనల్ కోర్సు అధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *