Breaking News

ధార్మిక సేవలో సామాజిక సేవ మిళితం అభినందనీయం…

-నిత్య అన్నదాన పధకానికి దాతల సహకారం ప్రశంసనీయం.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధార్మిక సేవలలో సామాజిక సేవలు మిళితం కావడం అభినందనీయమని, మానవసేవే మాధవసేవ అనే సూక్తికి సరైన నిర్వచనం నిత్య అన్నదాన కార్యక్రమమే కూరగాయలు పంపిణీ అని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
దివంగత ధార్మికవేత్త మండవ కుటుంబరావు స్ఫూర్తితో మరడ నాగేంద్ర (నాగు) ఆధ్వర్యంలో స్థానిక నక్కల రోడ్డు నుండి దాతల సహకారంతో టి టి డి నిత్యాన్నదాన పధకానికి ఉచిత కూరగాయల పంపిణీ వాహనానికి గురువారం జిల్లా కలెక్టర్ పూజా కార్యక్రమం నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఎంతోమంది సేవాతత్పరులు వారి వారి అభిరుచి మేరకు విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారన్నారు. అయితే లక్షలాదిమంది ప్రతిరోజు దర్శించుకునేందు తిరుమలకు తరలి వస్తారన్నారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. అటువంటి పవిత్ర క్షేత్రానికి కూరగాయలు పంపించడం కూడా దేవుని అనుగ్రహంగానే భావించాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉండే మత విశ్వాసాల ఆధారంగా వారి వారి విశ్వాసాల ప్రకారం భగవదనుగ్రహం పొందడం కోసం చేసే సేవలలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇటువంటి సేవలు అందించేందుకు ఆర్థిక శక్తి తో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఇటువంటి సేవలకు పునాది వేసిన దివంగత మండవ కుటుంబరావు బాటలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగేంద్ర బృందం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదన్నారు. బృహత్తర కార్య క్రమంలో భాగస్వామ్యలైన ప్రతి ఒక్కరినీ అభిందించాలన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వాహకులు ఎం .నాగేంద్ర మాట్లాడుతూ 2004 లో ప్రారంభించిన ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో ఇప్పటి వరకు నగరం నుండి సుమారు 25 వేల టన్నులు కూరగాయలను టీటీడీకి వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎంతోమంది దాతలు తనతో కలిసి రావడం భగవదనుగ్రహమేనన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని, అటువంటి సేవలో తమలాంటి స్వామి వారి భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ బృహత్కార్యక్రమంలో డాక్టర్ బుర్రా అనూప్, పూజిత, ధూళిపాళ సాయి ప్రశాంత్, సత్య ప్రణతి, శ్రీయాన్ష్ ప్రణవ్, ఆకుల వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, చందన, తరుణ్, ఛాగన్ లాల్, ముత్యాల రిషాన్, అక్షయ ఫార్మసీ అధినేత వివేక్, బాలాజీ ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు, కొప్పుల వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటరత్నం, శారద, డాక్టర్ కర్నాటి జనార్ధన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *