విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 పురస్కరించుకుని ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖామాత్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చే చిరుధాన్యాలతో రుచికరమైన 100 రకాల వంటలు – 100 value Added Millet Recipes అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో సులభంగా ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకునే విధముగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమములో మంత్రి తో పాటు వ్యవసాయ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ IAS, డాక్టర్ శారద జయలక్ష్మి, వైస్ ఛాన్సలర్, ఆచార్య NG RANGA వ్యవసాయ యూనివర్సిటీ , గుంటూరు, Ch.బాలునాయక్, వ్యవసాయ ఉప సంచాలకులు & ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News