Breaking News

గుడ్లవల్లేరు మండలం పురిటిపాడులో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటన…

-రూ.61.80లక్షలతోనిర్మించిన సచివాలయం…R.B.Kకేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని
-కులమత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్న సీఎం జగన్ కు…. ప్రజలు తమ ఆశీస్సులు అందించాలి
-మలి విడత వైసిపి ప్రభుత్వంలో గుడ్లవల్లేరు – ముదినేపల్లి రహదారి డబల్ రోడ్డు గా అభివృద్ధి చెందుతుంది

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు గజమాలలు వేస్తూ, పూల వర్షం కురిపిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.గ్రామస్తులు, వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని ర్యాలీగా పర్యటించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామ పర్యటన కొనసాగించారు. దారి పొడవున మంగళ హారతులు ,పూలమాలలతో మహిళలు ప్రజానీకం ఎమ్మెల్యే నానికు ఆత్మీయ స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా రోడ్డుమీద తారసపడిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని, పాఠశాలలో అందిస్తున్న వసతులు గురించి అడిగారు. అన్ని బాగున్నాయన్న చిన్నారులు థాంక్యూ కొడాలి నాని మామయ్య అంటూ ఎమ్మెల్యే నానికు కరచాలనం చేశారు. అనంతరం రూ.61.80లక్షలతో గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా ప్రతినిధులు, జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతు రాష్ట్రంలోనీ మారుమూల గ్రామాల్లో సైతం విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలని పూర్తి స్థాయిలో అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని పరితపించిన సీఎం జగన్ వాలంటిర్లు, సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. గుడ్లవల్లేరు నుండి ముదినేపల్లి వరకు రహదారి ప్యాచ్ వర్క్ పనులు అతి త్వరలో మొదలవుతాయని కొడాలి నాని తెలిపారు. మలి విడత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముదినేపల్లి వరకు రహదారిని పది మీటర్ల వెడల్పు చేస్తూ డబల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని కొడాలి నాని హామీ ఇచ్చారు. కులం మతం పార్టీలు చూడకుండా పేదలందరికీ మంచి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కొడాలి నాని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే తలంపుతో ప్రభుత్వ కార్యాలయల నిర్మాణానికి స్థల దానం చేసిన దాత బొర్రా గోపాలరావును ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు. అనంతరం ఆయనను పూలమాలలు శాలువాలతో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్,పాలేటి చంటి, జిల్లా యువజన యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు గుదే రవి,ఘంటా సురేష్,ఎంపీటీసీ ముక్కు సోమేశ్వరం రావు,సర్పంచ్ కాగిత నరేంద్ర,వైస్ సర్పంచ్ అనగాని రంగారావు, మండల పార్టీ నాయకులు పామర్తి హనుమంతరావు,బొర్రా అంక రమేష్, కొనకళ్ళ ప్రసాద్,బెజవాడ దుర్గరావు,వడ్లమూడి చిన్ని,బాడీగ నాని,కనుమూరి రామిరెడ్డి,దుగ్గిరాల శేషుబాబు,కొండలమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ శేషం గోపి,కట్టావానిచెరువు వైస్ సర్పంచ్ అబ్దుల్ ఇక్బాల్, గాదెపూడి సర్పంచ్ వీర్నాల లక్ష్మణరావు ,జన్ను చిరంజీవి,మంటాడ చలమయ్య, కుంచపర్తి సాయి, కొడాలి సుధాకర్,కిషోర్ నాయుడు, వీరబత్తిన రవి,మహారెడ్డి మురళి,కోటప్రోలు నాగు, కోటప్రోలు బాబురావు,కొడాలి శివ,పిన్నమనేని రాఘవేంద్ర,Md. ఇర్ఫాన్,ఈడే చిన్ని, నందివాడ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి గగారిన్,మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు , సచివాలయ కన్వీనర్ లు ,గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *