Breaking News

నగరంలో ఘనంగా అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో టెలీఫోన్‌ సృష్టికర్త, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం చుట్టుగుంట, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ప్రాంగణంలోని అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ విగ్రహం ముందు ఆయన జయంతి వేడుకలు విగ్రహ నిర్మాత మాజీ జెటిఓ నరాలశెట్టి రామమోహనరావు, సతీమణి మాజీ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ నరాలశెట్టి నిర్మల ఆధ్వర్యంలో అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కృష్ణాజిల్లా జనరల్‌ మేనేజర్‌ రవీంద్రనాథ్‌ విచ్చేసి పూలమాల వేసి నివాళులర్పించి టెలీఫోన్‌ సృష్టికర్త, ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సేవలను కొనియాడారు. విగ్రహ నిర్మాత మాజీ జెటిఓ నరాలశెట్టి రామమోహనరావు మాట్లాడుతూ అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ లేనిదే ఇప్పుడు వాడే ఫోన్‌లు గానీ, సెల్‌ఫోన్‌లుగానీ అసలు టెలీఫోన్‌ వ్యవస్థే వుండేది కాదని అటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త 3-3-1847లో జన్మించారని 75 సంవత్సరాలకు (2-8-1922) ఆయన మరణించారన్నారు. ఆయన జ్ఞాపకార్థం 2010లో ఈ కార్యాలయంలో ఈ కాంస్య విగ్రహానికి స్వంత ఖర్చులతో నిర్మించానని దీనికి అధికారులు, తోటి ఉద్యోగులు సహకరించారన్నారు. అప్పటి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ టి.ఎన్‌.సుధింద్రకుమార్‌, ఐటిఎస్‌, జనరల్‌ మేనేజర్‌ ఎం.జాన్‌క్రిసోష్టమ్‌ ఐటిస్‌లు ఆవిష్కరించారన్నారు. ఇంజనీరింగ్‌లో వున్న తనకు మొదటి నుండి టెక్నికల్‌ విషయంలో ఇంట్రెస్ట్‌తో మొట్టమొదట తయారు చేసిన టెలిఫోన్‌ నుండి ఇప్పటి వరకు వాడుకలో వున్న ఏవిధమైన టెలిఫోన్‌నునైనా సునాయాసంగా ఏమన్నా రిపేరు వస్తే రిపేరుచేస్తానన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 102 వివిధ రకాల ఆకర్షణీయమైన మోడల్స్‌లో ఫోన్‌లు తయారుచేసి అధికారులకు, రాజకీయ నాయకులకు తదితరులకు బహుమతులుగా ఫోన్‌లు హాబీగా అందచేశానని ఇప్పటి కొత్తకొత్త మొడల్స్‌ తయారు చేస్తున్నానన్నారు. త్వరలో ఒక కొత్త రకం అత్యాధునిక సాంకేతిక విధానంతో తయారుచేసిన ఫోన్‌ను ఆవిష్కరించబోతున్నానని తెలిపారు. ప్రయాణించేటప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవించే పరిస్థితులలో ముందుగా తెలుసుకునే విధంగా కొన్ని సాంకేతిక పరికరాలను కూడా కనుగొన్నానన్నారు. ఇది హాబీగా మాత్రమేనని తెలిపారు. అనంతరం పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెలీకం శాఖ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *