అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డోన్ పట్టణం నందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో పోస్టర్లు ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న రాజకీయ పార్టీలు మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా వెంట తిప్పుకుంటూ వెట్టి చాకిరీ చేయించుకుంటూ రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా ఏకపక్షంగా వైసిపి టిడిపి కాంగ్రెస్ బిజెపి జనసేన పార్టీలు ఓట్లు వేయించుకుంటూ వివక్షతతో చూస్తూ అనిసివేతలకు గురి చేస్తున్నారమన్నారు. 29 ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో ఒకే సామాజిక వర్గానికి 21 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ మూడు పార్లమెంటు స్థానాలు కేటాయిస్తూ మాదిగలకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తూ ఒక పార్లమెంటు స్థానం కేటాయిస్తూ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారన్నారు. మాదిగలు విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతూ ఉపాధిలేక ఆర్థికంగాలేక పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు చదివిన వారు వలస కూలీలుగా ఉపాధి హామీ కూలీలుగా మిగిలిపోయారు. మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించి రాష్ట్రంలో 46 లక్షల ఓట్లు ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో సమన్యాయం చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నామన్నారు. మాదిగలకు ఏ పార్టీ అయితే రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏకపక్షంగా మాదిగలను చైతన్యపరిచి ఓటు చైతన్యంతో రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలను అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగ, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల దొడ్డి ప్రసాద్ మాదిగ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య మాదిగ, వెల్దుర్తి మండలం అధ్యక్షుడు మద్దిలేటి మాదిగ, వెల్దుర్తి మండల కార్యదర్శి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News