-యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం
-సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు శ్రీకారం
-మంత్రి వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరంరూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, రాజమండ్రి రూరల్ పరిధిలో గల అర్బన్ ప్రాంతంలో రు.4.21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
సోమవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలోని 8 1/2 డివిజన్ లలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి రు.4. 21 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో ఉన్న 8 1/2 డివిజన్ లలో ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ఆర్ఎంసి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్ఎంసి చైర్మన్ జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేయగా ఇంజనీరింగ్ అధికారులు పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి తాను రూరల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టి నెల 15 రోజులు కాలంలో ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత నిచ్చి పనులు ప్రారంభించామన్నారు . గతంలో ఈ ప్రాంతం నుండి ఎన్నికైన శాసనసభ్యులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని, ఈ ప్రాంతంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవని స్థానికంగా ఉన్న ప్రజలు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉందని అన్నారు.
రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గ ఇన్చార్జిగా స్థానికంగా నా ముందు కోఆర్డినేటర్ గా పనిచేసిన చందన నాగేశ్వర్, స్థానిక నాయకులు అధికారులు సహకారంతో రూరల్ పరిధిలో అర్బన్ ప్రాంతంలోని ఎనిమిదిన్నర వార్డులలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కుల అభివృద్ధి, డ్రైన్స్, అంతర్గత రహదారుల నిర్మాణం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.
ఇందులో రాజమండ్రి రూరల్ డివిజనల్ పరిధిలో గల వార్డుల్లో రు.4.21 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రాంతాలవారీగా వివరాలను తెలియజేస్తున్నానన్నారు.
రు. 19 లక్షలతో 17వ డివిజన్ లోని ఐ ఒ సి ఎల్ బాంబే కాలనీలో సీసీ ఫ్లోరింగ్ పనులు, రు. 21 లక్షలతో పార్కు అభివృద్ధి పనులు, రు. 20 లక్షలతో శంభు నగర్ లో సీసీ డ్రైవ్ నిర్మాణ పనులు, రు. 19 లక్షలతో అంబికా నగర్ లో పార్క్ అభివృద్ధి పనులు, రు. 10 లక్షలతో 17వ వార్డు ఎస్.కే.ఎంక్లేవ్ ఎదురుగా ఉన్న పార్కు అభివృద్ధి పనులు, రు. 20 లక్షలతో బొగ్గులదిబ్బ పార్కు అభివృద్ధి పనులు, రు. 10 లక్షలతో 18వ డివిజన్ రైల్వే స్టేషన్ రోడ్డు కొండా వారి వీధిలోని మెయిన్ డ్రైనేజ్ స్లాబ్ పనులు, రు. 16లక్షలతో 20వ డివిజన్ లోని తాసిల్దార్ కార్యాలయం నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ వరకు నిర్మించనున్న సీసీ డ్రైవింగ్ పనులు, రు. 10 లక్షలతో 21వ డివిజన్ లో పెద్ద వారి వీధిలో ని సీసీ డ్రైన్ నిర్మాణ పనులు, రు. 9.90 లక్షలతో 26వ డివిజన్ లో స్టేడియం రోడ్ లో ఎమ్మెస్ గ్రిల్స్ స్లాబ్ మరియు ఇతర సీసీ డ్రైన్ లు మరమ్మత్తు పనులు, రు. 8.45 లక్షలతో 27వ డివిజన్ కృష్ణారావుపేట లోని అంతర్గత రహదారుల అభివృద్ధి పనులు, రు. 9.70 లక్షలతో 28 వ డివిజన్ లో శారద ఐస్ ఫ్యాక్టరీ రహదారి అభివృద్ధి మరియు మరమ్మత్తు, పనులు, రు. 8.80 లక్షలతో 28వ డివిజన్ లో కుమ్మరి వీధి రామాలయం నుండి కడియంచర్ల వారి వీధి వరకు సిసి రైలు నిర్మాణ పనులు, రు. 50 లక్షలతో 16వ డివిజన్ ఆదర్శనగర్ నుంచి 13,17,19,23,24 రహదారుల అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారి నిర్మాణ పనులు, రు. 40 లక్షల రూపాయలతో బొమ్మూరు తిట్కో గృహాలు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న సిసి రహదారుల నిర్మాణ పనులకు మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు మున్సిపల్ అధికారులతో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎస్.ఈ పాండురంగారావు, డీఈ శేషగిరిరావు, స్థానిక నాయకులు చికూరుమిల్లి చిన్న , గొందేటి శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డి, చాపరాజు, మమతా రెడ్డి, దమ్ము ప్రసాద్, రామరాజు, ప్రకాష్ బాబు, దుంపా చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ లో ఏవి రమణ, నేతల రామచంద్రరావు, సచివాలయ కన్వీనర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News