Breaking News

నగరపాలక సంస్థ స్పందన లో 41 అర్జీలు స్వీకరణ

-దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి వసతి, డ్రైనేజ్ పనుల అర్జీలను అర్జిదారు సంతృప్తి చెందే విధంగా సత్వర పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 41 అర్జీలను స్వీకరించామన్నారు.

ఈ సందర్భంగా కే . దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పరిష్కారము చెయ్యాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆస్తి పన్ను పెండింగ్ బకాయిలు వసూలు చెయ్యడం కోసం ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. ఇంటి పన్ను కోసం వచ్చె అర్జీలను స్వీకరించి, త్వరిత గతిన డిమాండ్ జారీ చేయాలన్నారు.

స్పందన లో వచ్చిన అర్జీలు:

ప్రకాష్ నగర్ కి చెందిన ఈ.శ్రీమన్నారాయణ మూర్తి వారీ కాలనీలో కాలువల్లోని మురుగు ను తొలగించమని అర్జీ ఇవ్వడం జరిగింది. టీ నగర్ కి చెందిన పి ఎస్ కుమారీ పెన్షన్ పథకం కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. వీరభద్ర నగర్ కి చెందిన పి. ప్రసాద్  రహదారి నిర్మాణం, వీధి దీపాల కొసం అర్జీ అందచేశారు. లలితా నగర్ కి చెందిన పి. మంగతాయారు తనకు టిడ్కో గృహం లేదా ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. బొగ్గుల దిబ్బ కు చెందిన వై. ఝాన్సీ తదితరులు స్కూల్ ఆయాల జీతాల బకాయిలు చెల్లింపు, జీతాలు పెంపు కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. స్పందన కార్యక్రమంలో లో మున్సిపల్ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *