Breaking News

నగరంలో సీ ఆర్ పి ఎఫ్ జవాన్ల తో కవాతు ప్రదర్శన

-సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సంభందిత ఏర్పాట్లను చెయ్యడం జరుగుతోంది
-ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందకు భరోసా కల్పించాలి
-పాల్గోన్న 200 మంది సి ఆర్ పీ ఎఫ్, 200 రాష్ట్ర పోలిసులు
-కలెక్టర్ మాధవీలత
-ఎస్పి పి. జగదీష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే క్రమంలో కవాతు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నట్లు కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం నగరంలో కంబాల చెరువు ప్రాంతం దండి మార్చ్ నుంచీ లాలా చెరువు వరకూ నిర్వహించిన సీ ఆర్ పి ఎఫ్ పోలీసింగ్ కవాతు ప్రదర్శన లో కలెక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్, మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, సీ ఆర్ పి ఎఫ్ జవాన్లు, జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల కు సంబందించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియని ప్రారంభించడం జరిగిందన్నారు. ఓటర్ల నమోదు , అవగాహన కల్పించడం, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, వివిధ బృందాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు,  వంటి కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల ను ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా చూడడం లో పోలీసింగ్ చాలా ముఖ్య భూమిక పోషించనున్నట్లు మాధవీలత తెలియ చేశారు. అందు కనుగుణంగా జిల్లా ఎస్పి పి. జగదీష్ ఆధ్వర్యంలో జిల్లా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను గుర్తించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్చాయుతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు రావడం జరిగిందనీ, ఎస్పి సూచనల మేరకు రానున్న రోజుల్లో మరిన్నీ రాష్ట్ర, కేంద్ర బలగాలు జిల్లాకి రానున్నట్లు తెలిపారు. పోలీసింగ్ కవాతు ప్రదర్శన జరపడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం లో భాగంగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిథిలో పోలీసింగ్ కవాతు ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించు కునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలలో భాగంగా కవాతు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు.

జిల్లా ఎస్పి పి.. జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని తెలియ చేశారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించడం అవసరం అని స్పష్టం చేశారు. కేంద్ర బలగాలు, స్ధానిక పోలీసులు మధ్య సమన్వయం పై దిశా నిర్దేశనం చేశామన్నారు. కేంద్ర బలగాలు చెయ్యవలసిన విధులు పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ కె..దినేశ్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) పి. అనిల్ కుమార్ , అడిషనల్ ఎస్పి (ఏ.ఆర్) ఎల్. చెంచి రెడ్డి, డి.ఎస్.పి.(ఎస్ బి) డి. ప్రభాకర్ , ఇన్స్పెక్టర్( ఎస్ బి) సూరి అప్పారావు, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *