-అభ్యర్ధులు చేసే ఎన్నికల ఖర్చుల నిమిత్తం వివరాలూ సేకరిస్తున్నాం..
-జేసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీకి, పార్లమెంటు తరపున వివిధ రాజకీయ పార్టీలు తరపున నిలబడే అభ్యర్ధులు చేసే ఖర్చులకు చెందిన ధరలు వివరాలు పై సంభందిత ఏజెన్సీలు యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కోనుగోలు కమిటి చైర్మన్ ఎన్. తేజ్ భరత్ తెలియ జేశారు. మంగళవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ మేనేజ్మెంట్, లాడ్జిలు, ప్రింటర్స్, ఫ్లెక్సీ, ఫోటో గ్రాఫర్స్, విడియో గ్రాఫర్స్, సిటీ కేబుల్ నెట్ వర్క్, రవాణా ప్రతినిథులు, తదితరులతో సమావేశం నిర్వహించారు
ఈ సందర్బంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఆయా అభ్యర్ధులు చేసే ఖర్చులకు చెందిన సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు , వాటికి వారూ చేసే ఖర్చుల వివరాలు ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోనే వివిధ రకాల ఖర్చుల నిమిత్తం వారు నిర్ధారించిన ధరలను ఆయా అభ్యర్ధుల ఖాతాలకు జమ చెయ్యడం జరుగుతుందని అన్నారు. శాసన సభ్యులు ₹.40 లక్షలు , ఎంపీ ₹..95 లక్షలు వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అవకాశం ఉందని అన్నారు. ఆ మేరకు అభ్యర్ధుల ఖర్చులను తనిఖీ చేసే బృందాలు వాటినీ ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే హోటల్ మేనేజ్మెంట్, లాడ్జిలు, ప్రింటర్స్, ఫ్లెక్సీ, ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, సిటీ కేబుల్ నెట్ వర్క్, రవాణా వ్యవస్థ ద్వారా ధరలను పేర్కొనడం జరిగిందని, వాటినీ జిల్లా పరిధి లో యూనియన్స్ ద్వారా ధరలను నిర్థారణ చేసుకోవడం జరుగుతోందని అన్నారు. వివిధ ప్రచారాలు నిర్వహించే క్రమంలో తప్పని సరిగా ముద్రించే కరపత్రాలు సంఖ్య , గోడ ప్రతుల సంఖ్య, ప్రింటింగ్ కోరిన వారీ వివరాలు, ప్రింటర్ వివరాలు తప్పని సరి అన్నారు. అనధికారికంగా ప్రచురణ, ప్రసారం చేయడం ఉల్లంఘన కింద పరిగణిస్తారని తేజ్ భరత్ పేర్కొన్నారు. కేబుల్ టీవీ లలో ప్రసారం అయ్యే స్క్రోలింగ్, ప్రకటన లు సమాచారం తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సభలు సమావేశాలు నిర్వహించే క్రమంలో ఖర్చులను అంచనా వేసి అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా చూపడం జరుగుతుందనీ అన్నారు
Prajavartha Online Telugu News