-కవాతు లో కదం కలిపిన జేసి, రూరల్ ఆర్వో తేజ్ భరత్
-సైనిక దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ గా చిన్నారి
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సాయుధ దళాలు మరియు స్థానిక పోలీసు వారిచే రాజమండ్రీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఫ్లాగ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించటం జరిగిందని రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఐ వో సీఏల్ కాలనీ వద్ద నుండి ప్రారంభమై ధవళేశ్వరం లో కవాతు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ , ఈ కవాతు ప్రదర్శన ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందనీ అన్నారు. భద్రత పరంగా ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో కేంద్ర బలగాలు రావడం జిల్లాకి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పి ఎమ్..అంబికా ప్రసాద్, 400 మంది కేంద్ర సి ఆర్ పి ఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసు బృంద సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News