Breaking News

బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టు వస్త్రాలు

-సమర్పించిన మార్కండేయ వంశీకులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు తేదీ.08.03.2024 శుక్రవారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళగిరిలో భక్త మార్కండేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత మగ్గాలపై వారం రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి శివభక్త మార్కండేయ వంశీకులు చేనేత పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రధాన కైంకర్య పరులుగా మార్కండేయ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు గంజి చిరంజీవి-రాధ దంపతులు, చిల్లపల్లి శ్రీనివాసరావు-గౌరీ దంపతులు అమ్మవార్లకు అయ్యవార్లకు చేనేత కళ్యాణ వస్త్ర నివేదన చేశారు. మార్కండేయ ట్రస్ట్ చైర్మన్ దామర్ల వెంకట నరసింహ ఆధ్వర్యంలో సభ్యులు పవిత్ర నేత పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, విభూది, ఫల పుష్పాలు తదితరాలను 11 సాంప్రదాయ వెదురు పల్లెములలో తలపై పెట్టుకుని ఆలయానికి విచ్చేశారు. వీరికి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామరావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాలు తో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. తదుపరి మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి చేనేత శ్వేత పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల ఆశీర్వచన అనంతరం ట్రస్టు బోర్డు చైర్మన్, ఈవోలు శివ భక్త మార్కండేయ వంశీకులకు ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీలు చిల్లపల్లి మోహనరావు, అందే నాగ ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అవ్వారు శ్రీనివాసరావు, బిట్రా శ్రీనివాసరావు బిట్రా వేణు దంపతులు. ట్రస్ట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవస్థాపక సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణానికి చేనేత వస్త్రాలు సమర్పించడం మార్కండేయ వంశీకుల పూర్వజన్మ సుకృతం అని, త్వరలో ఈ ఆచారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా శాఖలు ఏర్పాటు చేసి ప్రముఖ ఆలయాలలో మార్కండేయ వంశీకులకు ప్రత్యేక గౌరవం దక్కే విధంగా కృషి చేస్తామన్నారు ఎంతో పవిత్రంగా నేత నేసిన చేనేత వస్త్రాలను భక్తిశ్రద్ధలతో అన్ని ఆలయాలకు అందే విధంగా ప్రణాళిక రచించి ఏడాది కాలంలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *