-జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలి
-ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అధికారులు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ, జర్నలిస్ట్ హౌసింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీ శ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఎంఎస్ఎమ్ఈ సర్వే, జర్నలిస్ట్ హౌస్ సైట్స్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవిఎం, గౌరవ సిఎం లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలపై కలెక్టర్ జెసి శుభం బన్సల్ తో కలిసి ఆర్డిఓలు, డిఎల్డిఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సoదర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియను మునిసిపల్ కమిషనర్, ఎంపిడిఓలు ప్రతి రోజూ సచివాలయం వారీగా పెండింగ్ ఎంఎస్ఎంఈ సర్వే పనులకు సంబంధించిన నివేదికలను సమీక్షించి త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై ప్రాధాన్యత ఇస్తున్నదనీ కావున ఇళ్ల స్థలాల కేటాయింపు పక్రియను ఆర్డీఓలు మరియు తాశిల్దార్లు బాధ్యతగా వెంటనే పూర్తి స్థాయి నివేదికలతో కలెక్టరేట్ కు పంపాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పేదలందరికీ ఇళ్లు పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవిఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి, డి ఎల్ డి ఓ సుశీల దేవి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News