Breaking News

ఇఫ్తార్ విందులో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష లో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 22వ డివిజన్,మజీద్ -ఏ-కౌసర్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొండారెడ్డి,వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుస్సేన్,మెయిన్, కో అప్షన్ సభ్యులు అలీమ్,మండల అధ్యక్షులు రిజ్వాన్,జోగరాజు, ముస్లిం నాయకులు ఫజులుద్దేన్,జవీద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *