విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో భరతనాట్యం చిత్ర బృందం సందడి చేసింది. ఆ చిత్ర ప్రమో షన్స్‌లో భాగంగా విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌నందు ఆ చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు సూర్యతేజ ఏలే మాట్లాడుతూ క్రైమ్, కామెడి ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుం దన్నారు. ఏప్రిల్ ఐదోవతేదీన ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంద న్నారు. ప్రతి ఒక్కరు చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి తానే కథను రాశానని, రాసే సమయంలో ఈ చిత్రంలో హీరోగా నటిస్తానని అనుకోలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా నటించాల్సి వచ్చిందన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ఉత్కంఠపరిచేలా ఉంటుందన్నారు.
ప్రొడ్యూసర్ పాయల్ సరఫ్ మాట్లాడుతూ..ప్రొడ్యూసర్‌గా ఇది తనకు తొలి చిత్రం అని, అమ్మవారి ఆశీర్వచనాలతో ఈ చిత్రం ప్రమోషన్స్ విజయ వాడ నుంచి ప్రారంభించామని చెప్పారు. చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడకు వచ్చామని, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళ్తున్నామని తెలిపారు. పిఆర్ బ్యానర్స్ పైన ఈ చిత్రం విడుదల కానుందన్నారు.
హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.
డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర మాట్లాడుతూ…తన తొలి చిత్రం దొరసాని పెద్ద హిట్ అయిందన్నారు. ఆనంద్ దేవరకొండతో తొలి చిత్రం తీశానని, రెండో చిత్రం కూడా నూతన నటీనటులతో తీశానని చెప్పారు. భరతనాట్యం అనే టైటిల్ మూవీకి రిలేటెడ్‌గా ఉండబోతుందన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు అజయ్ గోష్, కమెడియన్ హర్ష, హర్షవర్ధన్ నటించారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెజర్ ట్రైలర్‌కు విశేష స్పందన లభించిందన్నారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా విజయాన్ని సాధిస్తాయని, ఏప్రిల్ 5న ప్రతిఒక్కరూ థియేటర్లకు వచ్చి చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరారు. చిత్రం ప్రమోష న్స్లో భాగంగా విద్యార్థులను కలిసినప్పుడు విశేష స్పందన లభించిందన్నారు.
Prajavartha Online Telugu News