Breaking News

కాకినాడ శివాలయ అర్చకులకు ఫోన్ లో మల్లాది విష్ణు పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ హితం కోరే పురోహితులు, అర్చకులంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అపార గౌరవమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కాకినాడ శివాలయ ఘటనలో బాధిత అర్చకులు వెంకట సత్యసాయి, ప్రధాన అర్చకులు కార్తీక్ లను గురువారం ఆయన ఫోన్ లో పరామర్శించారు. తగిన న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అర్చకులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, రీజనల్ జాయింట్ కమిషనర్, ఈవోలతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోరుకునే పురోహిత, అర్చక వ్యవస్థ పట్ల ప్రతిఒక్కరూ గౌరవ భావం కలిగి ఉండాలని.. వారి పట్ల దాడికి తెగబడే వారు ఎవరైనా పార్టీలకతీతంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుందని తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, పురోహితుల హక్కులను కాపాడే విధంగా కఠినమైన చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి.. అర్చకులు, పురోహితులపై ఉద్దేశపూర్వకంగా దాడులకు తెగబడే వారిని కఠినంగా శిక్షించేలా ఒక చట్టాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తామని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *