విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
విజయవాడ : డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. మహేష్ కుమార్ రావిరాల బుధవారం విడుదల చేశారు. తాడేపల్లి లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం డా. మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హజరయ్యారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్. అంబేద్కర్ గురకులాల్లో బాలికలకు 9,280 సీట్లు, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్ధులు http.//apbragcet.apcfss.in నందు పొందగలరని డా. మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఉన్నత ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన …
Prajavartha Online Telugu News