Breaking News

గొప్ప సాంఘిక సంస్క‌ర్త‌.. మ‌హాత్మ జ్యోతిరావు ఫూలే

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంస్కర్తగా మహాత్మ జ్యోతిరావు ఫూలే చేసిన సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని.. మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం ఆయ‌న ఎనలేని కృషి చేశారని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే జ‌యంతి సంద‌ర్భంగా గురువారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జ్యోతిరావు ఫూలే చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు అలంక‌రించి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దోపిడీ, అణచివేత, వివక్షత‌లను ఎదుర్కొనేందుకు బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చ‌దువు ముఖ్య‌మ‌ని భావించి.. విద్యను చిత్తశుద్ధితో మనోధైర్యంతో శ్రద్ధతో అభ్యసించి, ఉన్న‌తంగా ఎదగాల‌ని స‌మాజానికి చాటిచెప్పి అందులో విజ‌యం సాధించిన మ‌హ‌నీయులు జ్యోతిరావు ఫూలే అని పేర్కొన్నారు. ప్ర‌జ‌లకు సాంఘిక న్యాయం, సమాన హక్కుల కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి చైత‌న్యం తెచ్చి, విశేష సేవ‌లు అందించార‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *