-బీసీ యువజన పార్టీకి భారీగా వలసలు
-వందలాదిగా చేరిన యువత..
-ఆర్సివై నాయకత్వానికి, బీసీవై సిద్ధాంతాలపై హర్షం!
పుంగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు రాజధాని ప్రాంతం మంగళగిరి నుండి కూడా పోటీ చేస్తున్నారు. చాలా కాలంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న రాజకీయం, వ్యవహారాలపై రామచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో జరుగుతున్న రౌడీ రాజకీయాలు, ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న దోపిడీ తదితర అంశాలపై తీవ్ర స్థాయిలో రామచంద్ర యాదవ్ ఎండగడుతూ ఉన్నారు. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తూ ఉంది. నియోజకవర్గంలో రాజకీయ మార్పులు భారీగా కనబడుతున్నాయి. అధికార వైసీపీ నేతలు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను కట్టడి చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తున్న క్రమంలో నియోజకవర్గంలోని ప్రజల్లో బీసీవై పార్టీకి ఆదరణ పెరుగుతోంది.
వివిధ పార్టీల నుండి భారీగా యువత చేరిక
తాజాగా ఇవేళ బీసీవై పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. పుంగనూరు మండలం ఉలవలదిన్నె యువత, బాలాజీ కాలనీ యువత, మున్సిపాలిటీ పరిధిలోని వందలాది మంది యువతతో పాటు బండ్లపల్లె కు చెందిన వందలాది మంది యువకులు బీసీవై పార్టీలో చేరారు. పార్టీ లో చేరిన యువతకు రామంచంద్ర యాదవ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో యువత బీసీవై పార్టీలో చేరుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయంగా మార్పు కనబడుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
Prajavartha Online Telugu News