విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్ ఆటో 150 సీసీ బైక్ పల్సర్‌లో అధునాతన టెక్నాలజీతో శుక్రవారం వరుణ్ బజాజ్, విజయవాడ షోరూంనందు పల్సర్ 150 యుజిను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పి.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వరుణ్ బజాజ్ మాట్లాడుతూ ఈ బైక్‌ను 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, క్లోజ్డ్ లూప్డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్, 14 హార్స్ పవర్, 13.4 ఎన్.ఎం. టార్క్ అందించగల, 5`స్పీడ్ గేర్ బాక్స్, ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ క్రొత్త పల్సర్‌లో 3డి డెకాల్, డిజిటల్ బ్లూ టూత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్ మేనేజ్మెంట్, యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్, నోటిఫికేషన్స్ వంటి ఫీచర్స్ ఇవ్వటం జరిగినది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. సింగల్ డిస్క్ ఎక్స్ షోరూం ధర రూ. 1,12,301లుగా మరియు ట్విన్ డిస్క్ ఎక్స్ షోరూం ధర రూ 1,16,237లుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ. పద్మజ, సదత్ బాషా ఏరియా మేనేజర్, బజాజ్ ఆటో మరియు వరుణ్ బజాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News