Breaking News

జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం…

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
“జగనన్నకు మద్దతుగా – జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం ” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొన్నారు. శుక్రవారం మండలంలోని కలవపాముల గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు_ , బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా కలవపాముల గ్రామం సిద్ధం కార్యక్రమంలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి   ప్రసంగించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కలవపాముల గ్రామంలో జోగి రమేష్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపను సందర్శించి జగనన్న సంక్షేమ పాలన ప్రజలకు వివరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *