Breaking News

జగన్మాత సన్నిధి లో అష్టావధానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రి ధర్మ పధం కళా వేదిక పై జరుగుతున్న సాంసృతిక కార్యక్రమాల్లో భాగంగా నాల్గవ రోజైన తేదీ 12.04.24 శుక్రవారం రాత్రి 7 గంటల నుండి అష్టావధానం కార్యక్రమం మొదలైంది. తిరుపతి కి చెందిన యువ శతావధాని ఉప్పలడడియం భరత్ శర్మ అత్యంత రమణీయంగా పృచ్చకుల ప్రశ్నలకు పద్యపూరణ చేశారు.
పృచ్చకులు గా….
1. నిషిద్ధాక్షరి: పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్
2. సమస్య:  మెట్ట వెంకటేశ్వరరావు
3. దత్త పది: డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ
4. వర్ణన: పింగళి వెంకట కృష్ణారావు
5. ఛందోభాషణం: శ్యామలానంద
6. ఆశువు:  కె ఎస్ రామరావు7. న్యస్తాక్షరి: పి.భానుమతి
8.అప్రస్తుత ప్రసంగం: డాక్టర్ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ వ్యవహరించారు.

అమ్మవారి సన్నిధి లో ఇటువంటి సమున్నత కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *