Breaking News

ఐటీ వ్యవస్థ గురించి సమీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలయం ఐటీ విభాగం వారితో ఆలయ ఈవో కె ఎస్ రామరావు శుక్రవారం సమావేశమై దేవస్థాన నందు ఐటీ వ్యవస్థ గురించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఐటీ విభాగం వారితో పాటుగా 9&9 సాఫ్ట్ వెర్ కంపెనీ ప్రతినిధి మరియు సంబంధిత విభాగముల వారు ఉన్నారు. ఈ సందర్బంగా ఈవో ఆలయం నందు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, అమ్మవారిని భక్తులకు మరింత చేరువ చేయుటకు గాను ఆలయం నందు జరుగు ప్రతి సేవ కార్యక్రమములు భక్తులకు చేరేలాగా చూడాలన్నారు. భక్తులకు సాంస్కృతిక కార్యక్రమంలు, పరోక్ష సేవలపై మరింత అవగాహన కల్పించే విధముగా డిజిటల్ మార్కెటింగ్, తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. pos మెషిన్లు త్వరిత గతిన పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి, భక్తులకు మరింత సులువుగా, ఆలస్యం లేకుండా సంబంధిత సేవలు అందించుటకు గాను చర్యలు తీసుకొనవలసినదిగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *