Breaking News

ఓటు హక్కును భారత ఎన్నికల సంఘం సవరించిన నిబంధన 18ఎ ప్రకారం వినియోగించుకోవాల్సి ఉంటుంది….

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రిటర్నింగ్ అధికారి సూచించిన తేదీ నాడు నిర్దేశిత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, అత్యవసర సర్వీసులు శాఖల అధికారులు సంబంధిత నియోజకవర్గంలో తమ ఓటు హక్కును భారత ఎన్నికల సంఘం సవరించిన నిబంధన 18ఎ ప్రకారం వినియోగించుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సర్వీసులు శాఖల అధికారులు, సిబ్బంది ఫారం 12డి నందు ఏప్రిల్ 22 తేదీ లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సమర్పించి వారు సూచించిన తేదీ నాడు నిర్దేశిత ప్రదేశంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ నందు తమ ఓటు హక్కును భారత ఎన్నికల సంఘం సవరించిన నిబంధన 18ఎ ప్రకారం వినియోగించుకోవాల్సి ఉంటుందని, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది, అలాగే పోలీస్ శాఖ వారు ఎస్పీ ద్వారా ఫారం 12 నందు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సదరు ఉద్యోగి ఇంటికి పంపడం జరగదని తెలిపారు. ఈ మార్పు గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నాగ మల్లేశ్వర రావు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *