-స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర నిఘా విధులు
-వేసవి, అధిక ఉష్ణోగ్రతలు నేపధ్యంలో 38 కూలర్లు ఏర్పాటు
-కలెక్టర్ మాధవీలత, ఎస్పి పి జగదీష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ లో భాగంగా జిల్లాకు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలకు అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు , అందులో భాగంగానే కూలర్లు ను సమకూర్చడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవిలత, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్ లు తెలియ చేశారు. శనివారం ఎస్పి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాయుధ బలగాల అధికారులకి కలెక్టర్, ఎస్పి సమక్షంలో కూలర్లు ను అందచేశారు
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాకు వచ్చిన కేంద్ర సాయుధ బలగాలకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ సూచనలు మేరకు కూలర్లు సమకూర్చడం జరిగిందన్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు మీ వంతు సహకారం అందించాలని తెలియ చేశారు. సాయుధ బలగాలు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద, వారు బస చేసే ప్రదేశాల్లో కూలర్లు సమకూర్చడం జరుగుతుందనీ అన్నారు. ఆమేరకు 38 కూలర్లు సమకూర్చడం జరిగిందన్నారు.
ఎస్పి పి జగదీష్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని వారు బస చేసేందుకు ఏర్పాటు చేసిన బ్యారక్ల నందు ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసుకొనుటకు గాను ప్రతిపాదించిన వెంటనే కలెక్టర్ ఆమేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్ర బలగాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావలసిన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర బలగాల ఇంఛార్జి లతో మాట్లాడుతూ, మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకునీ వొస్తే జిల్లా యంత్రాంగం తరపున వాటినీ సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని ఎస్పి. తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ( లా అండ్ ఆర్డర్) పి అనిల్ కుమార్ అడిషనల్ ఎస్పీ( ఏ ఆర్) ఎల్ .చెంచి రెడ్డి , కేంద్ర సాయుధ బలగాల ప్రతినిథులు ఇతర పోలీసు అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News