-మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి.
-ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది నంది పురస్కరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగువారి ఇంట వెలుగులు తెచ్చే పండుగే ఉగాది పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి అన్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలోని ధర్మంచర కమ్యునిటి హాల్ లో క్రోధి నామ ఉగాదిని పురస్కరించుకుని సభ ఏర్పాటు అయ్యింది. శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డా.కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన ఫిలాంత్రోపిక్ సొసైటీ అఫ్ ఇండియా అధ్యక్షుడు డా.అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారి పండుగుల అన్నింటికీ ఆది ఉగాది అన్నారు. మన సంస్కృతి కి ప్రతిబింబమైన ఉగాది అందరిలో ఆత్మీయతలు నింపాలని ఆకాంక్షించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు కళారత్న ఎస్.పి భారతి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ప్రతీకలని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృశ్యా కళల అకాడమీ చైర్ పర్సన్ కుడుపూడి సత్య శైలజ మాట్లాడుతూ షడ్రుచుల ఉగాది పచ్చడిలా మన జీవితాలు కూడా ఉంటాయని, కష్టాలు అధిగమించి సుఖం గా జీవించడానికి సరైన మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. సభాధ్యక్షత వహించిన డా. కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ఫిలాంత్రోఫీక్ సొసైటీ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయని సమాజంలో ప్రతీ ఒక్కరూ సమాజ హితం కోసం ఏదో ఒకటి చెయ్యాలని పిలుపునిచ్చారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ అధ్యక్షుడు డా.అద్దంకి రాజా మాట్లాడుతూ ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు అయ్యింది అన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాలలో లలిత కళలను, కళాకారులను, సామాజిక వేత్తలను ప్రోత్సహిస్తు జాతీయ అంతర్జాతీయ స్ధాయిలో అనేక కార్యక్రమాలు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి పురస్కారాలను అందించిదన్నారు.. క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉభయ రాష్ట్రాలలో వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టులైన వారికి ఉగాది నంది పురస్కారాలు అందిస్తున్నమన్నారు. అనంతరం ప్రముఖులు చేతులుమీదుగా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా సుహాని క్రియేషన్స్ వారి దుర్దశ ఓడియా నాటిక అహుతులను అలరించింది. కార్యక్రమంలో ఇండో ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ కమిషనర్ డా. కె. వి రెడ్డి, ప్రముఖ సామాజిక వేత్త డా. గుబ్బల రాంబాబు, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి, మహిళా కమిషన్ సభ్యురాలు వినీత, బెహ్రెయిన్ తెలుగు సంఘ ప్రతినిధి రాయుడు వెంకటేశ్వరావు, టి.టి.డిబోర్డు మాజీ సభ్యుడు ధారావత్ బాల్ సన్ నాయక్, మాగంటి ప్రసాదబాబు, జల్లి విక్టర్ కుమార్, సి.హెచ్. సతీష్ కుమార్, డా.తురగా సూర్య రావు, కాశి కాంతిరేఖ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News