Breaking News

పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీ వో లు, ఏపీఓ లకు మాస్టర్ ట్రైనర్ అందచేసే శిక్షణ కార్యక్రమం సులభతరంగా ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించే విధానం లో ఉండాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి / జిల్లా జాయింట్ కలక్టరు ఏన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం  కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు పీ వో, ఎపివో లకు శిక్షణ ఇచ్చే ఎమ్ ఎల్ టి లతో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ముందుస్తు సమావేశం నిర్వహించడమైనది.

ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఏప్రిల్ 15 వ తారీకు న జరగబోయే మొదటి శిక్షణా కార్యక్రమం మీద ముందు గా అసెంబ్లి స్థాయి మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహణ పై అవగాహన కల్పించడం కోసం సమావేశం నిర్వహించా మన్నారు. ఏప్రిల్ 15 వ తారీకు న పి వో లు 335 మందికి, ఏ పీవో లు 443 మందికి వెరసి రిజర్వ్ స్టాఫ్ తో కలిపి 774 మంది ఎన్నికల సిబ్బంది కు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో మొదటి దశ శిక్షణా కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. సోమవారం జరగబోవు శిక్షణ లో తప్పనిసరిగా అందరి నుంచి హాజరు తీస్కోవాల్సిందిగా ఆదేశించారు. అదే సమయంలో వారీ నుంచి ఫారం-12 లను కూడా స్వీకరించవల్సింది గా తెలియ చేశారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన గ్రామ రెవిన్యూ అధికారులు బాధ్యత లపై జెసి సూచనలు ఇవ్వడం జరిగింది..

శిక్షణా తరగతులకు హాజరయ్యే ఎన్నికల అధికారులు, సహయ అధికారులు శిక్షణ స్థలం యొక్క చిరునామా సులభతరంగా తెలుసుకునేందుకు మార్గంలో ఫ్లేక్స్ లు ఏర్పాటు చేయాల్సింది గా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ వి ఎమ్ లకు ఇంచార్జీ గా నియమించిన గ్రామ సర్వేయర్లకు తగిన సూచనలు అందించి శిక్షణ ఇచ్చే క్రమంలో తీసుకోవలసిన కమీషన్ జారీ చేసిన మార్గదర్శకాలు పై అవగాహన కల్పించడం జరిగింది. ఇతర అనుబంధ విధులు నిర్వహించే సిబ్బంది ఎపిక్ వెరిఫికేషన్ బృందాలు, డిజిటల్ అసిస్టెంట్ ల విధులు బాధ్యతలు పై తగిన సూచనలు ఇవ్వడమైనది. శిక్షణ అనంతరం ఎన్నికల నిర్వహణా పై మూల్యాంకన పరీక్ష లో అధికారులు పాల్గొనాలని , తద్వారా వారికీ ఎన్నికల ప్రక్రియపై ఉన్న వారి పరిజ్ఞానం తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ సాయి బాబు, రూరల్ తహశీల్దార్ వై. కె. వి. అప్పా రావు, కడియం తహశీల్దార్ బి. రమాదేవి, ప్లానింగ్ అధికారి కోటయ్య , డిప్యూటీ తహశీల్దార్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *